18, డిసెంబర్ 2010, శనివారం

నను వలచావని తెలిసేలోపే నివురైపోతాను...


నిన్ను మరచిపోవాలనీ
నీవైపు చూడకుండనే వుండాలనీ
ఎన్నిసార్లో అనుకున్నాకున్నా...
అది సాధ్యపడక మిన్నకున్నా...

నా హృదయంలో కొలువైన నీ రూపం
కనుల ఎదుట కనుమరుగవుతుంటే...
కలనైన నీ ఎడబాటునూహించని నా హృదయం
మంచు పెళ్ళలుగా విరిగిపడుతుంటే...
నా అపరాధమేమిటో తెలుపని నీ మౌనం
నిలువునా నను దహించివేస్తుంటే...

నేను చేయగల సాయం ఒక్కటే
నిను మరచిపోవడం..
నీకిచ్చే అభయమొక్కటే
నీ స్మృతులను చెరపివేయడం...
అది నావల్లకాదని నీకూ తెలుసు
ప్రయత్నిస్తా నేస్తమా...
నిను వీడిపోతా ప్రియతమా..

నీ జ్ఞాపకాల నీడలలో
నన్నెపుడో చూస్తావు..
మనసు పొరల తడిలో
మంచు బిందువులా అగుపిస్తాను...
నీ గుండె గదులలో
దాగిన ప్రేమను వెలిగిస్తావు...
నను వలచావని తెలిసేలోపే
నివురైపోతాను...

2 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

మీ కవితలు చాలా బాగున్నాయండి

veera murthy (satya) చెప్పారు...

apurwa garu namaste!

మీకిదే కవితా పోటీకి ఆహ్వానం

http://neelahamsa.blogspot.com/2011/02/open-challenge.html

-satya

కామెంట్‌ను పోస్ట్ చేయండి