18, డిసెంబర్ 2010, శనివారం

నను వలచావని తెలిసేలోపే నివురైపోతాను...


నిన్ను మరచిపోవాలనీ
నీవైపు చూడకుండనే వుండాలనీ
ఎన్నిసార్లో అనుకున్నాకున్నా...
అది సాధ్యపడక మిన్నకున్నా...

నా హృదయంలో కొలువైన నీ రూపం
కనుల ఎదుట కనుమరుగవుతుంటే...
కలనైన నీ ఎడబాటునూహించని నా హృదయం
మంచు పెళ్ళలుగా విరిగిపడుతుంటే...
నా అపరాధమేమిటో తెలుపని నీ మౌనం
నిలువునా నను దహించివేస్తుంటే...

నేను చేయగల సాయం ఒక్కటే
నిను మరచిపోవడం..
నీకిచ్చే అభయమొక్కటే
నీ స్మృతులను చెరపివేయడం...
అది నావల్లకాదని నీకూ తెలుసు
ప్రయత్నిస్తా నేస్తమా...
నిను వీడిపోతా ప్రియతమా..

నీ జ్ఞాపకాల నీడలలో
నన్నెపుడో చూస్తావు..
మనసు పొరల తడిలో
మంచు బిందువులా అగుపిస్తాను...
నీ గుండె గదులలో
దాగిన ప్రేమను వెలిగిస్తావు...
నను వలచావని తెలిసేలోపే
నివురైపోతాను...

Leia o post completo...

12, డిసెంబర్ 2010, ఆదివారం

చకోరంలా నిరీక్షిస్తా నీకోసం

 నీ జ్ఞాపకాలు నీడలలో
నీ అనుభూతుల ఝడిలో
మైమరచిపోయా నీ మాయలో
కనులలోని నీ రూపం కనుమరుగవుతుందేమోనని
అలసిన నా కళ్ళనడుగు నిద్రలేని రాత్రులెన్నో

నువ్వంటే అంతిష్టం ఎందుకో నాకు
సమాధానం లేని ప్రశ్నే అని తెలుసు నీకు
నీ చిరు దరహాసం మళ్ళీ మళ్ళీ చూడాలని
వసంతంకై ఎదురుచూసే కోయిలనై
నీ పిలుపుకై పరితపించే తపస్విని నేను

నీ మనసు తలుపు తట్టి
నీ అధరాలు ఒడిసిపట్టి
చిరుగాలి స్పర్శలా నిను స్పృశిస్తా
ఆకర్షణ అని తోసివేస్తావో
ఆరాధన అని లాలిస్తావో...

చెలివో శిలవో తెలియకుంది నీ మౌనం
చెలిమి బంధమల్లుకుంది నా ధ్యానం
సర్వ జగత్తు నిదురమత్తులో సోలిపోయే వేళ
చకోరంలా నిరీక్షిస్తా నీకోసం

Leia o post completo...

10, డిసెంబర్ 2010, శుక్రవారం

దూరమౌతున్న నేస్తమా!

దూరమౌతున్న నేస్తమా!
జ్ఞాపకాల హారమా!
వీడిపోని బంధమా!
స్నేహ సుమగంధమా!
నా ప్రియ నేస్తమా!
నను మరువకుమా!

నీవు నను మరచినా
నీ దరహాసం నను విడచునా!
నీ చూపులు మరలినా
ఆ స్పర్శ నను తడమదా
నీ ఎడబాటు కన్నీరై మిగిలినా
ఆ రూపం నా కనుపాపలో కరుగునా

Leia o post completo...

నా ప్రాణమా నను వీడి పోకుమా...


నా ప్రాణమా నను వీడి పోకుమా...  నీ ప్రేమ లో నను కరగనీకుమా...
పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తుంది, వద్దనా వినకుండా నిన్నే కోరుకుంటుంది.
అనితా .. అనిత ఓ వనిత, .... నా అందమైన అనిత ..దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన....!
నా ప్రాణమా నను వీడి పోకుమా , నీ ప్రేమ లో నను కరగనీకుమా ..
నమ్మవుగ చెలియా నే నిజమే చెబుతున్న,నీ ప్రేమ అనే పంజరాన చికుకుని పడిఉన్న,
కలలో కూడా నీ రూపం నన్ను కలవర పరిచేన, కను పాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే ..
నువోకచోట ... నేనోకచోట ..  నిను చూడకుండా నే క్షనముండలేనుగా
నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే, నా ఆశల రాణివి నీవే, నాగుండెకు గాయం చేయకే ..
అనిత ఓ వనిత .... నా అందమైన అనిత ..  దయలేదా కాస్తైన నా పేద ప్రేమ పైన ...
నా ప్రాణమా నను వీడిపోకుమా నీ ప్రేమ లో నను కరగనీకుమా ....!!
నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచ, ప్రతిక్షణము ధ్యానిస్తూ పసి పాపల చుస్తాన్న,
విసుగురాని నా హృదయం నీ పిలుపుకే ఎదురు చుస్తోంది ,
నిను పొందని ఈ జన్మే నా కేందుకని అంటుంది
కరునిస్తావో లేక , నను కాదని అంటావో , నా కమ్మని కళలు కూల్చి నను ఒంటరి వాడ్ని చేయకే,
అనిత .. అనితా ..అనిత ఓ వనిత, .... నా అందమైన అనిత ..
దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన..!!!
ఏదో రోజు నా పై నీ ప్రేమ కలుగుతుందని ఓ చిన్న ఆశ, నాలో చచెంత ప్రేమ మదిలో ,
ఎవరు ఏమనుకున్నా, కాలమే కాదన్న........ ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్న ,
వొట్టేసి చెపుతున్న, నా ఊపిరి ఆగువరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా ......
అనిత .. అనితా ..అనిత ఓ వనిత, .... నా అందమైన అనిత ..
దయ లేదా కాస్తైన నా పేద ప్రేమ పైన....!

Leia o post completo...